హైదరాబాద్: వాహనాన్ని సొంతం చేసుకునే సమయంలో, కస్టమర్ ఆనందాన్ని నిరంతరంగా పెంచే లక్ష్యంతో, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకీ) దేశంలో 4,500 టచ్ పాయింట్స్ ను చేరడానికి తమ సర్వీస్ నెట్ వర్క్ ను మరింత విస్త్రతం చేసింది. హిసాషి టకియుచి, మేనేజింగ్ డైరక్టర్ & సీఈఓ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు.
“ఈ గొప్ప విజయాన్ని సాధించినందుకు నేను మా డీలర్ భాగస్వాములు మరియు మారుతి సుజుకీలో సహోద్యోగులను అభినందిస్తున్నాను. ఉన్నతమైన ప్రోడక్ట్స్ మరియు ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ తో కాల క్రమేణా మేము కస్టమర్ విధేయత, నమ్మకం సంపాదించాము. 2,271 పట్టణాలలో 4,500కి పైగా సర్వీస్ టచ్ పాయింట్స్ కస్టమర్ ఆనందాన్ని పెంచాలని మా సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. కస్టమర్స్ కు ‘ప్రయాణపు ఆనందాన్ని ‘అందించడానికి మేము కట్టుబడ్డాము మరియు దీని కోసం కస్టమర్స్ కు సన్నిహితంగా చేరడానికి మా సర్వీస్ టచ్ పాయింట్స్ ను విస్తరించడానికి మేము నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాం, వేగవంతమైన, సరసమైన మరియు ఉన్నతమైన నాణ్యత గల సర్వీస్ అందిస్తున్నాం.”
ఇటీవల చేపట్టిన చొరవలు
ఆర్థిక సంవత్సరం 2022-23లో, మారుతి సుజుకీ 310 సర్వీస్ టచ్ పాయింట్స్ ను ఆరంభించింది. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్య. ఈ సర్వీస్ టచ్ పాయింట్స్ లో చాలా పాయింట్స్ గ్రామీణ ప్రాంతాలలో ఉండే కస్టమర్స్ కు కూడా సేవలు అందించడానికి పట్టణేతర మార్కెట్స్ లో చేర్చబడ్డాయి. కస్టమర్స్ సౌకర్యార్థం మారుతి సుజుకీ ఎన్నో కొత్త రూపాలను కూడా పరిచయం చేసింది. వీటిలో వారానికి ఏడు రోజులు మరియు ఎంపిక చేసిన వర్క్ షాప్స్ లో, రాత్రిపూట సేవా సదుపాయాలు, ఇంటి వద్ద సేవల లభ్యత, ప్రత్యేకంగా రూపొందించబడిన ‘సర్వీస్ ఆన్ వీల్స్’, మారుతి మొబైల్ సపోర్ట్ మరియు కస్టమర్స్ సౌకర్యార్థం సేవలు పొందడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ వంటివి భాగంగా ఉన్నాయి. గ్రామీణ మార్కెట్స్ కోసం కంపెనీ మారుతి సుజుకీ సేల్స్ & సర్వీస్ పాయింట్ (MSSSP) చొరవను పరిచయం చేసింది. పట్టణ ప్రాంతాలలో కస్టమర్స్ కు సహాయపడటానికి వాణిజ్య ప్రదేశాలలో డ్రై వాష్ సేవలను అందించడానికి చిన్న వర్క్ షాప్స్ ఏర్పాటు చేయబడ్డాయి.