Friday, November 22, 2024

రేపో రేటుపై ఆర్‌బిఐ కీలక నిర్ణయం…6.5శాతం యథాతథం!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత రిజర్వు బ్యాంకుకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి) రెపో రేటు సమీక్ష నిర్ణయాలు ప్రకటించింది. పరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశ నిర్ణయాలను రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ నేడు(గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా, మునుపటి మాదిరిగానే 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారాయన. ద్రవ్యోల్బణం తగ్గిన్నందున రెపోరేటును పెంచేదిలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పులేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్‌బిఐ రెపోరేటును స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు(ఎంఎస్‌ఎఫ్) రేటు 6.75 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ(ఎస్‌డిఎఫ్) రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, క్యాష్ రిజర్వు రేషియో(సిఆర్‌ఆర్) రేటు 4.50 శాతంగా ఉన్నట్లు భారత రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపోరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బిఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కపనిష్ఠ స్థాయికి 4.7 శాతానికి దిగి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News