Monday, December 23, 2024

కారుపై ట్రక్కు బోల్తా: ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గురువారం రహదారిపై వెళుతున్న ఒక స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యువి)పై ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కు బోల్తా పడడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.

దోల్ గ్రామ సమీపంలోని సిద్ధి-తికరి రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్‌పి రవీంద్ర సింగ్ తెలిపారు. మొదట ఎస్‌యువిని ఢీకొట్టిన డంపర్ ట్రక్కు ఆ తర్వాత దానిపై బోల్తాపడిందని ఆయన చెప్పారు. ఎస్‌యువిలోని ఏడుతురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు ఆయన తెలిపారు. ప్రమాద స్థలానికి పోలీసు బృందాలు హుటాహుటిన తరలి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News