Monday, December 23, 2024

పాల్వంచలో ఎర్రజెండాను సగర్వంగా నిలబెడదాం

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : ఎర్రజెండాను పాల్వంచ ప్రాంతంలో సగర్వాంగా నిలబేడదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం సిపిఐ మాజీ మండల కార్యదర్శి దేవరకొండ నాగాచారి స్వగృహం నారాయణపేటలో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. తుదిశ్వాస వరకు ప్రజలకోసం పనిచేసిన అమరులకు ఆదర్శంగా ఉద్యమాలు నిర్మించాలన్నారు. దేవరకొండ నాగాచారి లేని లోటు ఆయన కుటుంబానికే కాక పార్టీకి కూడా తీరని లోటు అన్నారు.

అనునిత్యం ప్రజల పక్షాన నిలిచి సిపిఐ విస్తరణకు నాగాచారి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యుడు ఉప్పుశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, రాజు, అజిత్, రామకృష్ణ, ఎల్లంకి శివరావు, మేక రాంబాబు, సత్యనారాయణ రెడ్డి, గుర్రం నాగయ్య, ధనమ్మ, దేవరకొండ నాగాచారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News