Friday, December 20, 2024

మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  •  కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు : మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. నాటి పాలకుల నిర్లక్షంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయితే నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయా గ్రామాల నుంచి చెరువుల వరకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్యకారుల వలలతో ఊరేగింపు నిర్వహించారు. చెరువుగట్టుపై ముగ్గులు వేసి తోరణాలతో అలంకరించి, కట్టమైసమ్మ, చెరువు నీటికి పూజలు చేశారు. చెరువు కట్టలపై సభలు నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ కోలాటాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన సమావేశాలలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ కాకతీయ పథకంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు.

ముదిరాజ్ సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. మిషన్ భగీరథతో చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చి, కాళేశ్వరంతో చెరువులను నింపి వ్యవసాయానికి సాగునీరు, మత్య సంపదకు కృషి చేశారని తెలిపారు. ముదిరాజ్‌లకు లైసెన్సులు, చెరువులపై హక్కులు, ఉచితంగా చేపపిల్లలు, సబ్సిడీపై వాహనాలు, రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించారని ఎమ్మెల్యే కొనియాడారు.

కడ్తాలలో జరిగిన కార్యక్రమాలలో జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపిటిసి లచ్చిరాంనాయక్, ఎంపిడిఒలు ఫారూక్‌హుస్సేన్, రామకృష్ణ, ఎంపిఒలు మధుసూధనాచారి, శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారులు అరుణకుమారి, శ్రీలత, ఇరిగేషన్ ఏఈలు నిఖిల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News