Monday, December 23, 2024

చేప పిల్లల పంపిణీలో మత్స రంగానికి వెన్నుముకగా నిలుస్తున్నాం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స రంగానికి వెన్నుముకగా నిలుస్తున్నామని కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం క్రీడా మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మత్స శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్‌కు జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో పాటు సమీకృత మత్స అభివృద్ధి పథకం కూడా మత్సకారుల్లో విశ్వాసాన్ని, భరోసాను కల్పించాయని తెలిపారు.

మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పూడికతీత ఫలితంగా చెరువుల్లో నీటి సామర్థం పెరగడం, తదితర కార్యక్రమాల పర్యవసానంగా జలవనరుల సామర్థంతో చేపలు పెంపకానికి అనువుగా ఉన్నట్లు చెప్పారు. నిరాధరణకు గురైన మత్స సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా మత్సకారుల కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రజలు సందర్శించాలన్నారు. మత్స సంపద పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని వివిధ సంఘాల నుంచి చెరువుల ద్వారా వివిధ రకాలైన చేపలతో ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశారని అభినందించారు.

చేపల వినియోగం వల్ల ప్రోటీన్లు వస్తాయని, వినియోగించుకోవాలని పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో ఈ ఒక్క సంవత్సరంలోనే 743పై చిలుకు చెరువుల్లో నూరు శాతం సబ్సిడిపై కోటి 77 లక్షల చేప పిల్లలు వేసినట్లు తెలిపారు.50కి పైగా ఉన్నటువంటి సోసైటీల్లో 3 వేలకు పైగా ఉన్నటువంటి మత్సకారులు, సొసైటీలో లేని జీవనం సాగిస్తున్న మత్సకారుల కుటుంబాలకు జివనోపాధి కల్పించినట్లు చెప్పారు. సమీకృత మత్స అభివృద్ధి పథకం క్రింద 10 చెరువులకు గాను 51 లక్షల విలువైన 21 లక్షల రొయ్య పిల్లలు వేసినట్లు తెలిపారు. ప్రోటీన్లున్న ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు అవగాహన కోసం ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చాలా మంచి రుచికరమైన వంటలు చేశారని అభినందించారు.

ఈ ఫెస్టివల్‌లో ఉత్తమ వంటకాలను ఎంపిక చేసి ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు చెప్పారు. తదుపరి మత్సశాఖ సిబ్బంది శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ వలలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, జిల్లా మత్సశాఖ అధికారి వీరన్న, తహసీల్థార్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News