Friday, December 20, 2024

వెంకటాయపల్లిలో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: తూప్రాన్ మండల పరిధిలోని వెంకటాయపల్లి గ్రామంలో బుధవారం రాత్రి శివ్వంపేట సునీత (36) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తూప్రాన్ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం సునీతకు అదే గ్రామానికి చెందిన స్వామిగౌడ్‌తో పెళ్లయింది. సంసారం విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం రాత్రి భార్యభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన సునీత ఇంట్లో తలుపులు వేసుకుని చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గురువారం ఉదయం కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా సునీత ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. మృతురాలి తల్లి బండకాటి సత్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News