Saturday, November 23, 2024

ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటున్నాం

- Advertisement -
- Advertisement -

మెదక్: మిషన్ కాకతీయ ద్వారా సాసర్లలా ఉన్న చెరువులను కప్పుల్లా మార్చుకొని ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం వల్ల నేడు చెరువులు నిండుకుండలా జలకళ సంతరించుకున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలం కొంటూర్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఎత్తుకొని చెరువు కట్టపై బతుకమ్మ ఆడారు. కలెక్టర్‌తో కలిసి కట్ట మైసమ్మ, గంగమ్మకు పూజలు నిర్వహించి గంగ హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 2014కు పూర్వం కరెంటు, నీళ్ల గోస ఉండేదని, తెలంగాణ వస్తే చీకటే అన్న వారి నోళ్లు మూయిస్తూ సిఎం కెసిఆర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు కాళేశ్వరం జలాలు అందించి సాగునీటి, త్రాగు నీటికష్టాలు తీర్చాడని అన్నారు. గతంలో చెరువు, కుంటలు కబ్జా చేసి మాయం చేసేవారని, కానీ నేడు మిషన్ కాకతీయ ద్వారా మెదక్ నియోజకవర్గంలో 484 చెరువులలో పూడిక తీసి నీళ్లు నింపుకుంటున్నామని, తద్వారా భూగర్భజల మట్టాలు పెరిగి పరోక్షంగా సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. గతంలో సాగుకు సింగూరు జలాలు ఇవ్వమని దర్నాలు చేస్తే హైదరాబాద్‌కు మంచినీటికి తరలించేవారని, నేడు గోదావరి జలాలను అందిస్తున్నారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పనులు సాగుతున్నాయని, మధ్యలో రైలేవ ట్రాక్ రావడం వల్ల కాస్త పనులు ఆలస్యమైనా కాల్వ నిర్మాణః పనులు పూర్తి చేసుకుని నీలందిస్తామన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ చేయనున్నామని, బీసీ వృత్తులు వారికి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహయం అందించనున్నామని అన్నారు. 16 నుంచి సొంత జాగా కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడులక్షలు ఆర్థిక సహయం అందించే పథకాన్ని ప్రారంభిస్తామని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆసరా పింఛన్లను 57 సంవత్సరాలకు కుదించి ప్రతినెల 2016 రూపాయలు ఇస్తున్నామని, సదరం క్యాంపులు నిర్వహించి గుర్తించిన దివ్యాంగులకు3016 పింఛన్లు అందిస్తున్నామన్నారు.

ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి ఎదో ఒక విధంగా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధ్దిపొందుతున్నారని, నాడు-నేడుఉన్న పరిస్థితులను చూసుకుంటే అన్ని విషయాలు మననం చేసుకోవడానికే ప్రభుత్వం 21 రోజులపాటు వివిధ శాఖల ద్వారా రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నదని అన్నారు. అంతకుముందు బాల్యంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని చెరువు కట్టపై గోటిలాట, చిర్రగోనె, టైర్ ఆటలు ఆడి కలిసి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేటి యువత స్మార్ట్ ఫోన్‌కు బానిసవుతున్నారని, సాంప్రదాయ ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మత్స సహకార సంఘాల సభ్యులు, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్‌రావు, మత్సశాఖ సహాయ సంచాలకులు రజిని, ఆర్‌డిఓ సాయిరాం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News