Friday, November 15, 2024

వికారాబాద్‌కు క్రిటికల్ కేర్ హాస్పిటల్ మంజూరు

- Advertisement -
- Advertisement -
  • ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

వికారాబాద్: వికారాబాద్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ ప్రభుత్వం జిఓ విడుదల చేసింది. సిఎం కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావులకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నా పేద ప్రజలకు అత్యవసర వైద్యం అందాలంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద ఆసుపత్రుల్లో మాత్రమే అత్యవసర వైద్యం అందుబాటులో ఉంటుంది.

అలాంటి అత్యవసర వైద్యాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చే విధంగా సిఎం కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్‌రావులకు ఇక్కడి ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయం ఆవశ్యకతను వివరించి, వికారాబాద్‌లో అత్యవసర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు అత్యవసర చికిత్స కేంద్రాలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తే ఆ నాలుగింటిలో ఒక యూనిట్ మన వికారాబాద్‌కు రూ.28.34 కోట్ల వ్యయంతో 50 పడకల అత్యవసర చికిత్స విభాగాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News