మాదాపూర్: అందరికి విద్య అనేది అందిరి బాధ్యత దీనిలో మనంమందరం భాగస్వాములు కావాలని స్టేట్ ఆబ్జర్వర్ జి. ఉషారాణి అన్నారు. గురువారం శేరిలింగంపల్లి మండలలోని కొండాపూర్‌లోని కొత్తగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొదటి విడత ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాధికారి కె. వెంకటయ్యలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడలో పర్యటించి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన సౌకర్యం ఉన్నతమైన విద్యార్హతలు, అత్యుత్తమమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు గల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఉషారాణి కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్ అందిస్తున్నదని, పోషకాలతో కూడిన రుచికరమైన ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నదన్నారు. పాఠశాలలో డిజిటల్ బోధన సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడిలేని విద్యా, సహజసిద్ధ్దమైన వాతావరణంలో విద్యార్థులకు అభ్యాసనం అందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు, మనబడి, మన బస్తీ మనబడి పథకం కింద పాఠశాలలో అ ధునాతన సౌకర్యాలు కలిగించి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి విద్యాను అందించుటకు కట్టుబడి ఉన్నదన్నారు.
అందరికి విద్య అనేది అందరి బాధ్యత అందులో మనమందరం భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్లిలల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. అనంతరం ఎంఇఒ వెంకటయ్య మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలకు గాను పరిష్కార మార్గాలు కూడా అందుతాయన్నారు. కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో ఆరులక్షలకు పైగా విద్యుత్ బిల్లు బకాయి ఉండటంతో సిఎస్‌ఆర్ కింద మౌరిటేక్ ఫౌండేషన్ మూడు లక్షల 84వేల రూపాయలు, మిగిలిన మొత్తం స్కూల్ పేరెంట్స్, కమ్యూనిటీ పర్సన్స్ ద్వారా వసూల్ చేసి విద్యుత్ బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు.
ఇందుకుగాను అబ్జర్వర్ మేడం, ప్రాథమిక పాఠశాల కొత్తగూడ ప్రధానోపాధ్యాయులు ఎం. నాగయ్య, ఉపాధ్యాయ బృందాన్ని కొనియాడారు. బడి బాట కార్యక్రమం అమలు తీరు ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు, పిల్లల తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్‌పై అబ్జర్వర్ సంతృప్తి చెంది ఉపాధ్యాయు బృందాన్ని అభినందించారన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ గోవింద్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. నాగయ్య, 8వ పోలీస్ బెటాలియన్ హెడ్ మాస్టర్ బాలరాజు, సిఆర్‌పి రాములు, ఎండి ఇసాక్‌షరీఫ్, కోల రమేష్, పద్మనాభచారి, కావలి రమేష్, మహలక్ష్మి, జి. స్వప్న తదితరులు పాల్గొన్నారు.