Monday, December 23, 2024

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలం దరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరుపుకోవడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి వంటిదన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోలీసు సామాజిక సమ్మేళనం కార్యక్రమం మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సమిష్టి పోరాటం, ఎన్నో వందల మంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, .శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, తద్వారా రాష్టా నికి పెట్టుబడులు వచ్చి ఎన్నో రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ 2014కు ముందు అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకపడ్డ తెలంగాణ, సిఎం కెసిఆర్ సారథ్యంలో బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా చెరువుల పండు గ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో, ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకు రక్షణ ఇస్తున్నామన్నారు.

సిసిటివిల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు, ఎసిపి, డిసిపి జోన్‌లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని, పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లా డుతూ, ‘గతంలో రాష్ట్రంలో బలంగా ఉన్న నక్సలిజం వల్ల ఎన్నో ఏళ్ళు ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగేవి కావు, మరెన్నో మంచి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందేవి కావు. దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడింది. కానీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత పోలీసు శాఖలో చేసిన మార్పులు, చేపట్టిన కార్యక్రామాల వల్ల శాంతి భద్రతలు మెరుగుపడి పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు వల్ల ఎన్నో కొత్త కొత్త సాంకేతిక వనరులు, అధునాతన పెట్రోలింగ్ వాహనాలు పోలీసు శాఖలో ఏర్పాటయ్యాయని తెలిపారు. న్యూయార్క్ వంటి నగరంలో కనిపించే పోలీస్ పెట్రోలింగ్ స్థాయికి నగర పోలీసు వ్యవస్థ చేరుకుందని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల మౌలిక వసతుల కల్పనతో పాటు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి రాష్ట్ర పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గతంలో ఉన్న హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో కలిపి ప్రస్తుతం తొమ్మిది కమిషనరేట్ లు తెలంగాణలో పనిచేస్తున్నాయని తెలిపారు.
డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ నేర నియంత్రణలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో సమానంగా రాచకొండ పోటీపడుతోందని అభినందించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయడబడతాయి, తద్వారా నేర పరిశోధన వేగవంతం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిసిటివి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతమైందని, నేర శాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు. నూతన సాంకేతిక వనరులను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రాచకొండ పరిధిలోని నగర ప్రాంత పరిరక్షణే కాక గ్రామీణ ప్రాంతంలో శాంతి భద్రతల మీద కూడా సమాన దృష్టి పెట్టాలని సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రపంచ స్థాయి కార్పోరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటి కంపెనీలు పని చేస్తున్నాయని, వారి క్షేమం కోసం ఇరవై నాలుగు గంటలపాటు పోలీసు వారి పటిష్టమైన పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాచకొండ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలకు రౌడీయిజం, మాఫియా వంటి వారితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, నేరస్తుల మీద పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతోందని, అందువల్లే ఇక్కడ స్థిరాస్తి రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్, మహిళల మీద వేధింపులు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల తప్పుడు నంబర్ ప్లేట్లు వంటి ఎన్నో రకాల నేరాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందువల్లే రాచకొండ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పొలిసు వారి అధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన విభిన్న కార్యక్రమాల మీద రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం జరిగింది.

ఎంతో మంది సినియర్ సిటిజన్లు, మహిళలు వచ్చి కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఆసాంతం వీక్షించడం జరిగింది. రాచకొండ సెక్యురిటి కౌన్సిల్ సభ్యులు కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్, అడిషనల్ డిజిలు సంజయ్ కుమార్ జైన్, జితేందర్, సందీప్ శాండిల్య, శిఖా గోయల్, సిఐడి అదనపు డిజిపిమహేష్ భగవత్, ఐజిలు నాగిరెడ్డి, రమేష్ రెడ్డి, ఐఎఎస్ నవీన్ మిట్టల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎడిజి విజయ్ కుమార్, రాచకొండ జాయిం ట్ కమిషనర్ సత్యనారాయణ, డిసిపిలు జానకి , సాయి శ్రీ, మురళీధర్, మధుకర్ స్వామీ, అదనపు డిసిపి నర్మద, అడ్మిన్ డిసిపి ఇందిర, ఎసిపి లు, అధికారులు, టిఎస్‌పిహెచ్‌సిఎల్ చైర్మన్ కోలేటి దామోదర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News