Tuesday, April 8, 2025

శరద్ పవార్ ‘ఔరంగజేబ్ అవతారం’ అన్న బిజెపి నాయకుడు!

- Advertisement -
- Advertisement -

మండిపడ్డ ఎన్‌సిపి

కొల్హాపూర్: సోషల్ మీడియాలో ఔరంగజేబ్‌ను ఘనంగా కీర్తించడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) నాయకుడు శరద్ పవార్ ‘ఔరంగజేబ్ అవతారం’ అని బిజెపి నాయకుడు నీలేశ్ రాణే ట్వీట్ చేయడంపై నిరసన చోటుచేసుకుంది. ఎన్‌సిపి ప్రతినిధి మహేశ్ తాప్సే 24 గంటల్లో రాణే ట్వీట్‌ను తొలగించాలని అన్నారు.

కొల్హాపూర్‌లో బుధవారం ఈ రాజకీయ వివాదం రాజుకుంది. హిందూ సంస్థలు శివాజీ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు ఔరంగజేబ్‌ను, టిప్పు సుల్తాన్‌ను కీర్తించేలా ఉన్నాయంటూ ఈ నిరసన జరిగింది. తర్వాత ర్యాలీలో కొందరు ముస్లింల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై రాళ్లు రువ్వడంతో నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News