Sunday, November 24, 2024

భారత జనాభాలో 11 శాతానికి పైగా డయాబెటిస్ రోగులు: తాజా సర్వేలో వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భారతదేశ జనాభాలో 11.4 శాతం మంది డయాబెటిస్(మధుమేహ వ్యాధి)తో, 35.5 శాతం మంద్రి హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు)తో బాధపడుతున్నట్లు దేశవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే నివేదికను ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్ ప్రచురించింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్), ఇతర సంస్థలతో కలసి మద్రాసు డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది. భారత జనాభాలో 28.6 శాతం మంది సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం మంది పొట్ట స్థూలకాయంతో బాధపడుతున్నట్లు కూడా సర్వేలో తేలింది.

దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2008 నుంచి 2020 మధ్య ఈ సర్వే జరిగింది. మొత్తం 1,13,043 మంది సర్వేలో తమ అభిప్రాయం తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాలవారు 33,537 మంది గ్రామీణ ప్రాంతాల వారు 79,506 మంది ఉన్నారు.

భారత జనాభాలో 35.5 శాతం హైపర్ టెన్షన్‌తో బాధపడుతుందగా 15.3 శాతం మంది ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేగాక 81.2 శాతం మంది కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్(ఎల్‌డి-సి), ట్రిగ్లిసెరైడ్స్, హై డెన్సిటీ నలిపోప్రొటీన్(హెచ్‌డి-ఎల్) వంటి లిపిడ్స్ అసమతుల్యతైన డిస్లిపిడీమియాతో బాధపడుతున్నారని సర్వేలో బయటపడింది.

గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలోనే ప్రీడయాబెటిస్ తప్పించి ఇతర మెటబాలిక్ ఎన్‌సిడిలన్నీ అధికంగా ఉన్నట్లు తేలింది. డయాబెటిస్‌కు ప్రీడయాబెటిస్‌కు మధ్య నిష్పత్తి ఒకటి కన్నా తక్కువే ఉందని సర్వే ద్వారా తెలిసింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన పరిశోధకులు ఈ సర్వే బృందంలో ఉన్నారు.

గత అంచనాల కన్నా ప్రస్తుతం డయాబెటిస్, మెటబాలిక్ ఎన్‌సిడిలు భారత్‌లో అధికంగా ఉన్నాయని, వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన విధానాలను అమలు చేయాలని సర్వేలో పరిశోధకులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News