డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలిసి అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమానికి స్వర్గం చేసి చూపించిన ఏకైక వ్యక్తి సిఎం కెసిఆర్ అన్నారు. రెండో విడత భాగంలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంతో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలకు ఎన్నో దేశ స్థాయి అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మహిళ బాధలను దృష్టిలో పెట్టుకొని, ఒంటరి మహిళలకు ఆసరాపథకం ద్వారా పెన్షన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. శుక్రవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో జి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొని గొల్ల, కుర్మ లబ్ధిదారులకు గొర్రెల పెంపక అభివృద్ధి పథకం రెండో విడత భాగంలో 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్ల పంపిణీ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, బిసి కార్పొరేషన్, కులాంతర వివాహ లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సహకారంతో లక్ష మంది బీడీ కార్మికులకు పెన్షన్ పంపిణీ చేసిన ఘనత కవితకే దక్కిందన్నారు. నిన్న జరిగిన ప్రోగ్రాంలో ఇప్పుడే ఒక పెద్దావిడ చెప్పినట్టు వారి కొడుకులు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్క విద్యార్థికి వారానికి ఒకేసారి చికెన్, కోడిగుడ్లు పౌష్టికాహారం చదువుకోవడానికి బుక్స్, షూలు, బట్టలు సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ. 1,25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రజలంతా నా వాళ్ళు అని ఆలోచించే వ్యక్తి కేవలం ఒక కెసిఆర్ తప్ప మరే సిఎం ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు.. రారు అన్నారు.
ఇది ఒకటే కాదు వృద్ధులకు పింఛన్, ఇప్పుడే ఒక పెద్ద ఆవిడను అడిగాను. అవ్వ పింఛన్ ఎంత వస్తుందని అవిడ అంది 2000 రూపాయలు వస్తుందని చెప్పింది. ఒక వెయ్యి తినడానికి ఖర్చు చేసి ఒక వెయ్యి సేవింగ్ చేసుకుంటున్నా అని చెప్పింది. దీని కారణం ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ని చెప్పారు. ఒక ఇంటికి పెద్ద కొడుకుగా అన్నగా ఒక మేనమామగా కెసిఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఇలా అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ధర్పల్లి జడ్పిటిసి జగన్, ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, అన్ని మండలాలకు చెందిన ఎంపిపిలు, జడ్పిటిసిలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, సొసైటీ చైర్మన్లు బిఆర్‌ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, లబ్ధ్దిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.