ఎల్బీనగర్: నియోజకవర్గ అభివృద్ధే తన లక్షం అని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలో గ్రీన్‌పార్కు కాలనీలో సీసీ రోడ్డు పనులకు రూ.53.50 లక్షలు, తపోవన్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు రూ.34.00 లక్షలు, సాయినగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు రూ.13.00 లక్షలతో మొత్తం రూ.ఒక కోటి ఐబై వేల రూపాయలతో స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డితో కలిసి శుక్రవారం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సాయినగర్ కాలనీలో ఆయన మాట్లాడుతూ గతంలో చిన్న పాటి వర్షానికి లింగోజిగూడ పలు కాలనీలు ముంపునకు గురి అయ్యేవని ,ఇప్పడు పరిస్థితి మారిందిన్నారు.
వరద నీటి సమస్యల కోసం పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేశానని తెలిపారు. చైతన్యస్కూల్ ప్రక్కన ఎస్.ఎన్.డి.పి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ పార్కు కాలనీ ప్రతినిధులు కైలాష్‌రెడ్డి , బాల్‌రెడ్డి , తపోవన్ కాలనీ ప్రతినిధిలు ప్రసాద్ , బానుష్‌రాజు ,ఐలయ్య , కృష్ణ ,నరేందర్‌రెడ్డి ,మధు ,ప్రకాష్ ,రాజు, సీను, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు ,డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్‌రెడ్డి, తిలక్‌రావు ,మధుసాగర్, నర్రే శ్రీనివాస్, శ్రవణ్‌గుప్తా, నర్సింహ్మగుప్తా, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీనాథ్‌రావు, మల్లారాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.