Thursday, December 19, 2024

కాంగ్రెస్‌ గూటికి పొంగులేటి..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. సుమారు ఐదు నెలల పాటు కొనసాగిన రాజకీయ అనిశ్చితికి దాదాపు తెర తీసినట్లయింది. శుక్రవారం ఖమ్మం నగరంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు పరోక్షకంగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ నెల 12న హైదరాబాద్‌లో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరోజు పార్టీ లో చేరికపై అధికారికంగా వెల్లడిస్తానని ఈ సమావేశంలో ప్రకటించారు.సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గల నుంచి ముఖ్య అనుచరులు హజరయ్యారు.ప్రతి నియోజకర్గం నుంచి పది మందికి పైగా మాట్లాడారు.

దాదాపు మాట్లాడిన వారందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని ఆయన అనుచరులు సూచించారు.మరికొందరు అక అడుగు ముందుకు వేసి బిజెపిలో చేరడం వల్ల నష్టమే కాని లాభం లేదన్నారు.తన అనచరులు మాట్లాడిన తరువాత చివరికి పొంగులేటి మాట్లాడుతూ అందరి అభిప్రాయం మేరకు, మీ ఆలోచనమేరకే తన నిర్ణయం ఉంటుందంటూ పరోక్షకంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాననే సంకేతాలు ఇచ్చారు. ఈ నెల12న హైదరాబాద్‌లో విలేఖర్ల సమావేశం అనంతరం ఈ నెల 20 తరువాత ఢిల్లీకి వెళ్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటి అయ్యే అవకాశం ఉంది.విదేశి పర్యటనలో ఉన్న రాహుల్ గాంధి అప్పటికే ఢిల్లీకి చేరుకుంటారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయిన తరువాత ఈనెలాఖరిలోగా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకోనున్నారు.

ఈ సభకు రాహుల్ గాంధి లేదా ప్రియాంక గాంధిని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కొరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, బేబి స్వర్ణకుమారి,కోటా రాంబాబు, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, విజయబాయి. బోర్ర రాజశేఖర్, సూదిని జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News