ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో సుమా రు రూ.20 కోట్లతో విడిసిసి రోడ్ల నిర్మాణం చేసినట్టు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బోలక్‌పూర్ డివిజన్ రంగానగర్ బొంతల బస్తీలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం స్థానిక కార్పొరేటర్ గౌసుద్దీన్, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో రోడ్లను ఆ ధునీకరణ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమస్యలకు లేని నియోజకవర్గంగా ముషీరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం సీ డిఈ సన్నీ, ఏఈ సుభాష్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయ కులు ముఠా జైసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్, శంకర్ గౌడ్, రహీం, మక్బుల్, మహ్మద్ అలీ, ఉమాకాంత్, ప్రవీణ్, బస్తీ నాయకులు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.