Friday, December 20, 2024

11న ఛలో కొత్తగూడెం సిపిఐ ప్రజా గర్జన సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం ఈ నెల 11న ఛలో కొత్త గూడెం సిపిఐ ప్రజా గర్జన బహిరంగ సభ జరుగుతుందని, ఆ సభను విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ఏఐటియూసి) పిలుపు నిచ్చింది. ఆటోరిక్షా కార్మికులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, సహాయం గురించి చర్చించనున్నామని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం, కమతం యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, హైదరాబాద్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎండి ఉమర్ ఖాన్, యూనియన్ సలహాదారులు భిక్షపతి యాదవ్, అధ్యక్షులు కొమరెల్లి బాబు, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌కె లతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, యండి ఖాజా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News