Monday, January 20, 2025

గోషామహల్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

గోషామహల్: జన్ సంపర్క్ అబియాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌నగర్, చంద్రకిరణ్ బస్తీలతో పాటు పలు బస్తీల్లో పాదయాత్ర చేపట్టి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బస్తీ కమిటీలతో సమావేశమై వారికి గల సమస్యలపై చర్చించి, ప్రణాళికా బద్దంగా అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే రాజాసిం గ్ బస్తీ కమిటీ ప్రతినిధులకు హామీనిచ్చారు. ఈ సందర్బంగా స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఎం కృష్ణ, గోపాల్‌జీ, సోమ్‌రాజ్ సింగ్, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News