- Advertisement -
లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జగదంబతండాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. బిటెక్ విద్యార్థి ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందాడు. నిద్రలో గుండెపోటుతో మృతిచెందినట్లు సమాచారం. ప్రసాద్ ఇటీవలే బెంగళూరులోనే ఉద్యోగం సాధించాడు. ఇంతలోనే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -