Friday, December 20, 2024

జాబ్‌మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగు వేయండి

- Advertisement -
- Advertisement -
  • నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే రఘునందనరావు పిలుపు

దుబ్బాక: జాబ్‌మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగువేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు నిరుద్యోగ యువతకు పిలుపు నిచ్చారు. శనివారం దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనికాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ‘సింధుభారతి ఫౌండేషన్‘ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ సింధూ భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు వంద కంపెనీలు పాల్గొన్నట్లు ఆయన అన్నారు.

దుబ్బాక పేరును విశ్వనగరంలో మారుమోగించిన ఘనత జీనుప్యాంట్, రబ్బర్ చెప్పులు వేసుకున్న యువతదేనన్నారు. గత ఎన్నికల్లో తన గెలుపుకు యువత ఎలా సహకరించారోఅదేవిధంగా యువతను కూడా తన కాళ్లమీద నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. దయచేసి కోడి గుడ్డు మీద ఈకలు పీకే వారి మాటలు ఎవ్వరూ పట్టించుకోవద్దన్నారు. గతంలో నేను రూ.500లతో సిద్దిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానని, నేటి యువత కూడా అలాగే ఎదగాలని ఆకాంక్షించారు. దుబ్బాక నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని పారద్రోలడమే నా ప్రయత్నమని ఈ మహత్తరమైన కార్యక్రమానికి అందరూ సహకరించాల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News