Monday, December 23, 2024

ముగిసిన ఫిష్ పుడ్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం శనివారం ముగిసింది. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని పాత వెలుగు ప్రాంగణంలో మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వమిస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మత్స సహకార సంఘాల ఛైర్మన్ పిట్టల రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో భారీగా ఊరేగింపు నిర్వహించి రవీందర్‌కు గజమాల వేశారు. ఈ సందర్భంగా పిట్టల రవీందర్ మాట్లాడుతూ మత్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

రాష్ట్రంలో 5600 మత్స సొసైటీలున్నాయని,వీటిలో 4.75 లక్షల మంది సభ్యులున్నారని, సభ్యుల సంఖ్య ఇంకా పెంచాల్సి ఉందన్నారు. పులి మామిడి రాజు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మత్స సహకార సంఘాలను బలోపేతం చేయడానికి పిట్టల రవీందర్‌కు ఛైర్మన్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. అదే విధంగా బిసి.డి నుంచి బిసి.ఎకు వచ్చే విధంగా సిఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.జిల్లాలో ముదిరాజ్‌లను ఐక్యంగా ఉంచి వారి సంక్షేమానికి పాటుపడుతున్నామని వివరించారు. రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే మరింత న్యాయం జరుగుతుందన్నారు.స్టాళ్లను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఎడి సతీష్‌రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి,మాసాన్‌పల్లి నారాయణ, జిల్లా నాయకుడు పిట్టల రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News