- Advertisement -
హైదరాబాద్: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజును పురస్కరించుకొని మాసబ్‌ట్యాంక్‌లోని చాచా నెహ్రుపార్క్‌లో ఐఎఫ్‌ఎస్, అదనపు కమిషనర్, కృష్ణ, (ఓఎస్డీ అర్భన్ ఫారెస్ట్రీ, ఎంఏయూడి) మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతున్నారని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -