Saturday, November 23, 2024

యాదాద్రిలో వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం

- Advertisement -
- Advertisement -
  • చిన్నారులతో ఓనమాలు దిద్దించిన కలెక్టర్, ఈవో

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా సాగింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కొండకింద వ్రతమండపం హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సరస్వతి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చైర్మన్ నర్సింహ్మమూర్తి, ఆలయ ఈవో గీత ముఖ్యఅతిథులుగా పాల్గొని చిన్నారులకు పలకా, బలపం అందజేయగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కృపతో అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. సామూహిక అక్షరాభ్యాసంలో అధిక సంఖ్యలో తమ పిల్లలతో పాల్గొన్న తల్లిదండ్రులు స్వామి వారి సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ ఈవో గీత మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం జరిగిందని, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వామివారి కృప ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News