Sunday, December 22, 2024

ఉగ్రరూపం దాల్చనున్న బిపర్ జోయ్ తుపాను

- Advertisement -
- Advertisement -

ఉగ్రరూపం దాల్చనున్న బిపర్ జోయ్ తుపాను
గంటకు 145కి.మి వేగంతో పెనుగాలులు
పలు రాష్ట్రాలకు హెచ్చరికలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను మరి కొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా ఉగ్రరూపం దాల్చనుందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుడా తుపాను కదులుతోందని తెలిపింది. గంటకు 145కి.మి వేగంతో తీవ్రగాలులు వీస్తున్నట్టు వెల్లడించింది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. తీవ్ర తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో వైపు దక్షిణ చత్తీస్‌గడ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం శనివారం బలహీన పడింది. నైరుతి రుతుపవనాలు కేరళలోని మిగిలిన భాగాలతోపాటు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జాఫర్‌గడ్‌లో 80 మి.మి వర్షం కురిసింది. మోగ్డంపల్లిలో 55.3, నకిరేకల్‌లో 54.3, మూటకొండుర్‌లో 44.3 కనగల్‌లో 41.5, పిట్లంలో 35, అల్గోల్‌లో 34.3, వడ్డేకొత్తపల్లిలో 25.5, ఆత్మకూర్‌లో 22 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News