Saturday, December 21, 2024

లింగనిర్ధారణ స్కానింగ్ సెంటర్లపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం : లింగనిర్ధారణ స్కానింగ్ సెంటర్లపై వరంగల్ పోలీసులు దాడులు చేసిన తాజాగా యంత్రాలను అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్ సీపీ రంగనాథ్ శనివారం అమ్మకాలను జరిపిన ఇద్దరు వ్యక్తులతో పాటు లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ పరికరాలను స్వాధీనపర్చుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీపీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొంత మంది అక్రమాలకు పాల్పడుతూ లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వ్యక్తులను వరంగల్‌లో చేయిస్తున్నారు.

అరెస్టు అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన మల్లికుడి అశోక్‌కుమార్ విజయవాడలో 2012 నుండి ఎబిలిటి కన్సల్టెన్సీ సర్వీస్, ఇంజనీర్ ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను మరమ్మతులు చేసేవాడు.సులభంగా డబ్బును సంపాదించాలనకున్న అత్యాశతో 2018లో విజయవాడలోని అజిత్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకొని సొంతంగా సర్విసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వివిధ రకాల బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. ఇదే క్రమంలో పలు ప్రాంతాలకు చెందిన స్కానింగ్‌లు మరమ్మతులకు రావడం వలన డాక్టర్లతో పరిచయాలు పెరిగి మరో నిందితుడైన అశోక్‌కుమార్ పాత స్కానర్‌లను కొనుగోలు చేసి వాటిని రిపేరు చేసి అమ్మేవారు.

అదే తరహాలో వరంగల్, హన్మకొండ ప్రాంతంలో స్కానింగ్ యంత్రాలను మరమ్మతులు చేసే వేముల ప్రవీణ్‌తో పరిచయంతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా స్కానింగ్ మిషన్లను విక్రయించాడు.విక్రయించడానికి సిద్దంగా ఉన్న నాలుగు పోర్టబుల్, 11ఫిక్స్‌డ్ స్కానింగ్ యంత్రాలను విక్రయించడానికి సిద్దంగా ఉండగా వరంగల్ పోలీసులకు సమాచారం అందడంతో వారిని సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీపీ పుష్ప ఆధ్వర్యంలో కేయూసీ, దామెర పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News