Tuesday, December 24, 2024

శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు ప్రభంజనం

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: అమెరికాలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్, ఐఎస్‌డిసి కాన్ఫరెన్స్ లో శ్రీ చై తన్య స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాన్ఫరెన్స్ కు 2250 మంది విద్యార్థులు హజరవ్యగా వారిలో ఇండియా నుండి 105 మంది హజరవ్యగా 101 మంది విద్యార్థులు ఒక్క శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన వారు కావడం విశేషం. ఈ సందర్భంగా శ్రీచైతన్య కార్యలయంలో శనివారం శ్రీ చైతన్య అకడమిక్ డైరెక్టర్ సిమ బోప్పన్న విద్యార్థులను అభినందించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమే మాట్లాడుతూ ఎన్‌ఈఎస్‌ఏ మరియు ఐఎస్‌డిసి కాన్ఫరెన్స్ కాంటేస్ట్ కు దాదాపు 19 దేశాలన నుండి 25 వేల మంది విద్యార్థులు పాల్గోనగా ఇండియా నుండి 105 మంది అందులో శ్రీ చైతన్య విద్యాసంస్థల నుండి 101 మంది విద్యార్థులు పాల్గోని విజేతలుగా నిలిచి ప్రభంజనం సృష్టించారని అన్నారు.

ఈ కాంటేస్ట్ లో వరుసగా 10 వ సంవత్సరం ఒకటి, రెండు, మూడు భహుమతులతో పాటు 54 అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్టులతో శ్రీచైతన్య అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అంతేకాకుండా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం మరియు ఇజనీరింగ్ స్కిల్స్ హూస్టన్ స్ఫేస్ సెంటర్ సందర్శించాడం జరిగిందని పేర్కోన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించడం ద్వారా విద్యార్థులలో జ్ఙాన విజ్ఙానం, సృజనాత్మక బయటికి వస్తుందన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలలో ఒత్తిడితో కూడిన విద్యను కాకుండా వారికి మొదటి నుండే అడ్వాన్స్‌డు టెక్నాలజీ, స్కిల్స్, విజ్ఙానంతో కూడిన విద్యాను అందిస్తూ నిరంతరం విద్యార్థుల్లో దాగిన ప్రతిభను బయటకు తీసేందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని ఆమే తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆమే అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News