Saturday, November 23, 2024

అను ఫర్నిచర్ వాహనాలు నడి రోడ్డుపై అక్రమ పార్కింగ్

- Advertisement -
- Advertisement -

మియాపూర్: చందానగర్ పరిధిలోని అనూ ఫర్నిచర్, అను ఇంటిరియర్ రెండు బిల్డింగ్ ల మధ్య ఉన్న రోడ్డు పై వాహనాలను నిలుపుతు ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అను ఫర్నిచర్ బిల్డింగ్ వెనకల ఉన్న ప్రైవేటు హాస్పిటల్ కు రోగులు రావాలంటే అను ఫర్నిచర్ సిబ్బంది నిలిపిన వాహనాలను దాటుతు రావాలి, లేదంటే వేరే దారివెంట రావాల్సిన పరిస్థితు నెలకొన్నాయి. ఇదేమిటి అని ప్రశ్నించిన రోగుల కుటుంబ సభ్యులపై, వాహనదారులపై అను ఫర్నిచర్ సిబ్బంది దుర్భాషలాడుతూ దాడికి దిగడం సహజంగా మారింది.

చందానగర్ పోలిస్ స్టేషన్‌కు కాస్తా దూరంలో ఉన్న అను ఫర్నిచర్ బిల్డింగ్ ముందు వాహనాలను నిలుపుతు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గిస్తున్న పోలిసులు పట్టించుకోకపోవడం పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అను ఫర్నిచర్‌కు సంబంధించిన రెండు బిల్డింగ్‌ల ముందు గంటల తరబడి వాహనాలు నిలుపుతున్న, రోడ్డు పైన వారి వాహనాలను ఆపి ఫర్నిచర్‌ను దింపుతున్న అడిగే వారు లేక అను ఫర్నిచర్ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, యాజమాన్యం అండతో ప్రశ్నించిన వారిపైనే దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని వాహనదారులు, అటుగా హాస్పిటల్ వెళ్లే రోగుల కుటుంబసభ్యులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సమస్యపై సదరు యజమానికి తెలియజేసినా పట్టించుకోకపోవటంతోపాటు వారిపై దురుసుగా ప్రవరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News