Saturday, November 23, 2024

ప్రశాంతంగా ముగిసిన చేపమందు పంపిణీ

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: నాంపల్లి ఎ గ్జిబిషన్ మైదనంలో రెండురోజుల పా టు జరిగిన అస్తమా రోగులకు చేప మందు ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అపశృతులు వంటి జరగకుండా శాంతియుతంగా జరగడం సర్కార్ యంత్రాంగం, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేల సం ఖ్యలో జనం పాల్గొని చేప మందు తీసుకున్నారు. ప్ర భుత్వం వివిధ శాఖల అధికారులు కొన్ని రోజులుగా ఇక్కడే మకాం వేసి నిర్వహణ, ఏర్పాట్లను దగ్గరుండి చూ శారు.

ఏటా బత్తిన గౌడ్ కుటుంబం రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం అనవాయితీ. ఈ నేపద్యంలో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 9న ఉదయం 8 గంటలకు రాష్ట్ర మంత్రి టి. శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టారు. అ నంతరం పలు కౌంటర్ల వద్ద చేప ప్రసాదాన్ని బత్తిన కుటుంబం, వాలంటీర్లు జనం నోట్లో వేశారు. శనివారం మ ధ్యాహ్నం నిరంతరంగా చేప మందు పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. మ త్యశాఖ వర్గాలు చేప పిల్లలను కౌంటర్ల ద్వారా ప్రజలకు విక్రయించారు. మిగిలిన అనేక చేప పిల్లలను వారు తిరిగి వాపస్ తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీసులు. నిర్వాహకులు రం గంలోకి దిగి జనాన్ని బయటికి పంపించారు.

వివిధ శాఖల అధికారులు కూడా అక్కడి నుంచి తమ సామగ్రిలతో బయటికి వెళ్లారు. పలు సేవా సంస్థలు ఫలహరాలు, భోజనల పంపిణీ ప్రక్రియను ఉదయాన్నే తమ స్టాళ్లను మూసేశారు. సాయంత్రం వేళలో రైలులో బయలుదేరే రోగులు, వారి కుటుంబాలను మా త్రం షెడ్లలో పోలీసులు ఉండటానికి అ నుమతి ఇచ్చారు. మిగిలిన వారిని బయటికి తరిమేశారు. దీంతో మూడురోజులుగా ఎంతో సందడి ఉన్న మైదానం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ దఫా చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బత్తిని కు టుంబం రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ శా ఖల అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News