Monday, December 23, 2024

అసహజ శృంగారం… తెలంగాణ ఐఎఎస్‌పై కోర్టు మెట్లెక్కిన భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారి సందీప్ కుమార్ తనతో అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో పాటు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆయన భార్య కోర్టుకు వెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్భా న్యాయస్థానంలో జరిగింది. సదరు ఐఎఎస్‌పై ఎస్‌పి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించానని పేర్కొన్నారు. కట్నం కోసం తనను వేధించడంతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలపడంతో విచారణ జరపాలని ఎస్‌పికి కోర్టు ఆదేశించింది. ఐఎఎస్ సందీప్ సొంతూరు బిహార్‌లోని దర్భంగా జిల్లా. 2021లో సదురు యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు సందీప్‌కు కోటి రూపాయల నగదు, అభరణాలు కట్నం కింద ఇచ్చామని తెలిపారు. పెళ్లి తరువాత కూడా పలుమార్లు కట్నం కోసం తనని వేధించడంతో పాటు హింసకు గురి చేశారన్నారు. ప్రస్తుతం సందీప్ కుమార్ తెలంగాణ ఐటి శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News