Saturday, December 21, 2024

మోడీ పాలనలో ఒక్క అవినీతి మరకలేదు: జావదేకర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బిజెపి ప్రభుత్వమే వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. కరీంనగర్‌లో కేంద్ర మాజీ మంత్రి ఎంపి ప్రకాశ్ జావదేకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనలో ఒక్క అవినీతి మరకలేదన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో బిజెపి కూడా ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తామే అనుమతులు ఇచ్చామని, రామగుండం ఎరువుల ప్యాక్టరీకి కూడా అనుమతులు ఇచ్చామని, నేషనల్ థర్మల్ ప్రాజెక్టుకు కూడా అనుమతులు ఇచ్చామని, తెలంగాణలోనే జాతీయ రహదారులు ఎక్కువగా నిర్మిస్తున్నామని జావదేకర్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయోత్సవాల్లో కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

Also Read: భారత జనాభాలో 11 శాతానికి పైగా డయాబెటిస్ రోగులు: తాజా సర్వేలో వెల్లడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News