Friday, January 24, 2025

బిజెపోళ్లు ఆ పాటను ఎందుకు అందుకున్నారో అయోధ్య రాముడికే తెలియాలి: నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని వైసిపి నేత పేర్ని నాని విమర్శించారు. ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకె తెలియాలన్నారు. నడ్డా వ్యాఖ్యలకు పెర్ని నాని రీకౌంటర్ ఇచ్చారు. జెపి నడ్డా మనసు చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని ఎద్దేవా చేశారు. సిఎం రమేష్, సత్యకుమార్, సుజనా మాటలను బుర్రలోకి ఎక్కించుకొని మాట్లాడితే అది బిజెపోళ్ల కర్మ అని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచామన్నారు. అమరావతిలో జరిగిన పాపాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణం కాదా? అని నాని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని బిజెపి ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. టిడిపి పాటను బిజెపోళ్లు ఎందుకు అందుకున్నారో అయోధ్య రాముడికే తెలియాలన్నారు.

Also Read: అసహజ శృంగారం… తెలంగాణ ఐఎఎస్‌పై కోర్టు మెట్లెక్కిన భార్య

కేంద్రం రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని బిజెపోళ్లే చెప్పారని చురకలంటించారు. ఇసుక ఫ్రీ అంటూ టిడిపి, బిజెపి పెద్దలు దోచుకున్న విషయం అందికి తెలుసునన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం లిక్కర్ షాపులను ఇద్దరికే కట్టబెట్టిందని, లిక్కర్ సిండికేట్‌ను దందాగా నడిపింది టిడిపి, బిజెపి కదా? అని నాని అడిగారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ అమ్మకాలు తగ్గించామన్నారు. ల్యాండ్‌స్కామ్ అంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉంటుందని, బిజెపోళ్లపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుంటుందన్నారు.

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పేద, మధ్యతరగతి అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని, లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.2 లక్షల 16 వేల కోట్లు జమయ్యాయన్నారు. పైసా లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అ సంక్షేమం ఉందా? అని నాని అడిగారు. పేదలకు నేరుగా రూ.2.16 లక్షల కోట్లను అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం డబ్బయినా ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. బెంగళూరు జనం ఊసిన ప్రభుత్వం బిజెపోళ్లది కాదా? అని చురకలంటించారు. పచ్చపువ్వులతో నిండిన బిజెపి కాస్త టిజెపిగా మారిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News