Monday, December 23, 2024

ప్రశాంతంగా గ్రూప్ 1 పరీక్షలు

- Advertisement -
- Advertisement -

వనపర్తి: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినటు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి ప్రభుత్వ కొలువులు సాధించాలని అన్నారు. పరీక్షలు నిర్వహించే విధానాన్ని సిసి కెమెరాల ఫుటేజీల ద్వారా ఆయన పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, డిఎస్పి ఆనంద రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News