- Advertisement -
లండన్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్లూటిసి ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగింది. భారత్ పై 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో డబ్లూటిసి ఫైనల్లో మరోసారి భారత్ కు నిరాశ ఏదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్ర్రేలియా 270/8 డిక్లేర్డ్, భారత్ -234 పరుగులు చేయగలిగింది. డబ్లూటిసి ఫైనల్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. 2021లో ప్రారంభ ఎడిషన్ టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.
- Advertisement -