Saturday, December 21, 2024

హెల్త్ హబ్‌గా తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెల్త్ హబ్ గా తెలంగాణ అభివృద్ధి చెందిందని గ్లోబల్ సిటీ గా హైదరాబాద్ ఎదిగింది ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లో ఓప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, అదే విధంగా అరోగ్య రంగంలో అభివృద్ధి చెందింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు.

నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ వైద్యసేవల్లో అగ్ర స్థానంలో ఉంది. సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్‌లను గాంధీ, నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడుతున్నాయి. 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30 శాతం ఉంటే, గత నెల 70 శాతం చేరాయి.ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లో తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నట్లు వెల్లడించారు.

మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉందని వంద శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయి. అనవసర సి సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేటు ఆసుపత్రులు తోడ్పాటు అందించాలి. అనవసర సి సి సెక్షన్లతో అనేక ఇబ్బందులు ఉంటయన్నారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని నేడు అది రివర్స్ అయ్యింది. ఈ ఆసుపత్రి కూడా ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌలి ప్రసంగిస్తూ అత్యుద్బుతంగా ఆధునికరీంచిన సౌకర్యాలతో పాటు మెరుగైన సంరక్షణ, మద్దతు సేవలను అందిస్తున్న ఆసుపత్రి మరింత విస్తృతంగా ప్రజలకు చేరువైతుందని ప్రగాఢంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ఈసేవ మాత్రం ఖచ్చితంగా చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుందని, ముఖ్యంగా చికిత్సలో భాగంగా వైద్యులను భౌతికంగా కలవడానికి తక్కువ అస్కారమున్న వారికి ఈసేవలు ఎంతో మేలు చేస్తాయన్నారు. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని, తాను చూసిన నాటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చిందని, పనితీరును చూసి మంత్రి హరీష్‌రావుకు తాను పెద్ద అభిమానిగా మారారని చెప్పారు. ఈకార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్ సతీష్ ఘంటా తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News