Saturday, November 23, 2024

13 న సిద్దిపేటలో మోగా జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేటలో 52 కోట్లతో ఐటి టవర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువకులకు స్ధానిక ఉద్యోగాలు ఇవ్వాలనే లక్షంతో సిద్దిపేటలో ఐటి టవర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ నెల 15న ఐటి శాఖ మంత్రి కేటిఆర్, మంత్రి హరీశ్‌రావు ఐటి టవర్‌ను ప్రారంభించనున్నారు.

సిద్దిపేట నిరుద్యోగ యువతి యువకులకు ఈ నెల 12న తెలంగాణ ఐటి, టాస్క్ ఆద్వర్యంలో సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో మెగాజాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నారు. బిటెక్, ఎంబీఎ, ఎంసీఎ, బీఎస్సీ కంప్యూటరక్ తదితర అర్హత ఉన్న వారికి మంచి అవకాశాలు కల్పించనున్నారు. ఈ జాబ్ మేళాలో ముఖ్యఅతిధిగా మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు.

జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు చేయాలి

13న జరిగే మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌ను జిల్లా కలెక్టర్ అదేశించారు. వచ్చే కంపనీలకు స్టాల్స్‌ఏర్పాటు, యువతి యువకులు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐటీ అండ్ టాస్క్ ప్రతినిధులతో కలిసి స్టాల్స్ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే యువతీ యువకులు ఇంటార్వులో పాల్గొనేలా గైడ్ చేసే ప్రత్యేక వాలంటరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీరు, మజ్జిగ, స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి ప్రతినిదులు శ్రీనివాస్, టాస్క్ ప్రతినిధులు కుమార్, వంశీ, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News