Saturday, November 23, 2024

తెలంగాణ ఉద్యమంలో సాహిత్యందే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమంలో సాహిత్యందే కీలకపాత్ర అని, ఉద్యమంలో గళం గళం కలిపింది కవులేనని కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఐడివోసి కార్యాలయంలో నిర్వహించిన సాహిత్యం దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు, కళాకారులకు పుట్టినిల్లు భద్రాద్రి కొత్తగూడెం అని అన్నారు.

పాల్వంచ ఉద్యమాల గడ్డ అని, ఎందరో మహనీయులు త్యాగం చేశారని వారి త్యాగ నిరతిని కొనియాడారు. దశాబ్ధి ఉత్సవాల్లో కవులు, కళాకారులను సత్కరించుకోవడం అదృష్టమని అన్నారు. ఇల్లందు శాసనసభ్యులు బాణోత్ హరిప్రియ మాట్లాడుతూ సాయుధ పోరాటాల్లో సాహిత్యం ఒక ఉద్యమంలా వెలిగిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ యాస, భాషలు ఇతరులను అనుకరించే స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కవుల కలాల నుంచి జాలు వారిన సాహిత్యం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.

కవులు, కాళాకారుల కవితలు పాటల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసినట్లు చెప్పారు. ఈ వేడకులకు చిన్నారులు సైతం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భద్రాద్రి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని అవార్డులు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, డిపిఆర్‌వో శ్రీనివాస్, మహళా సంక్షేమ అధికారి సబిత, సిపివో శ్రీనివాసరావు, విద్యాశాఖ కో ఆర్డినేటర్ సైదులు, సీనియర్ కవులు దిలావర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News