Saturday, December 21, 2024

కుటుంబంతో పాటు సమాజంలోనూ మహిళల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: మహిళల ఆరోగ్యంతోనే సమాజం ముందడుగు వేస్తుందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని నోవాటెల్ హోట్‌లో కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య సదస్సు 2023 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై కిమ్స్ గ్రూప్స్ ఆఫ్ హస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్‌రావు, కిమ్స్ కడల్స్ ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి, ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ అనిత, కిమ్స్ ఆసుపత్రి నియోనాటాలజిస్టు, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి. అపర్ణ, ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గ జి. రావు, కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు డాక్టర్ జానకి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్‌లతో కలిసి గవర్నర్ పాల్గోని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మాట్లాడుతు మహిళల ఆరోగ్యంతోనే సమాజం ముందడుగు వేస్తుందన్నారు. కుటుంబంతో పాటు సమాజంలోనూ మహిళల పాత్ర ఎంతో కిలకమన్నారు. వారు బాగుంటేనే సమాజం ముందడుగు వేస్తుందన్నారు. ఏ చిన్న అనారోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని చెప్పారు. ఆలస్యం చేసేకొద్ద చిన్నది అనుకునే సమస్య చాలా పెద్దదైపోతుందన్నారు. అందువల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూ చించారు.

మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవమూ ఎంతో ముఖ్యమైనదన్నారు. భర్త , పిల్లలు, లేదా తల్లిదండ్రులు పట్టించుకుంటారులే అని వదిలేయడం సరికాదని, ఎవరికి వారే తమ ఆరోగ్యం విషయంలో పూర్తిస్ధాయి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, ఇలా ఏ రం గంలోనైనా దూసుకుపోతున్న మహిళలు ఒక్క ఆరోగ్యం విషయాన్ని మాత్రం సరిగా పట్టించుకోకపోవడం కనిపిస్తోందన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినందుకు డాక్టర్ శిల్పిరెడ్డికి అభినందనలు తెలిపారు.

భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డాక్టర్ శిల్పిరెడ్డి మాట్లాడుతు మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారు తమ ఆరోగ్యం గురించి నిపుణులను సంప్రదించే అవకాశం కల్పించడం, తమ సోంత ఆరోగ్య సమస్యలను గురించి ధైర్యంగా చర్చిందే అవకాశాన్ని కల్పించడం ఉమెన్స్ హెల్త్ కాన్‌క్లేవ్ లక్షమన్నారు. గర్బం, మెనోపాజ్, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ లాంటి అనేక అంశాలపై నిపుణులు వివరించడంతో పాటు విభిన్న వర్గాల నుంచి హజరైన మహిళలు ఆయా అంశాలపై చర్చించి, తమ సందేహలను నివృత్తి చేసుకున్నారన్నారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి తెసుకోవడానికి ఇతర మహిళలతో సంబంధాలు పెంపోందించుకోవడానికి, వాళ్ల ఆరోగ్యంపై వాళ్లకే తగిన నియంత్రణ ఉండేలా చేయడానికి ఈ సదస్సు ఒక గొప్ప అవకాశంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కడల్స్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందితో పాటు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News