Saturday, December 21, 2024

ముషీరాబాద్‌లో సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పింఛన్లను రూ. 3,116 నుంచి రూ. 4,116 వరకూ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్‌ఎస్ భోలక్‌పూర్ డివి జన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథి గా ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహలు హజరయ్యారు. వారు మాట్లాడు తూ తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ 9 సంవత్సరాలలో బడుగు, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభు త్వం పనిచేస్తోందని అన్నారు.

వికలాలంగులకు ఇప్పటికే రా ష్ట్ర ప్రభుత్వం రూ.3,116 లను పింఛన్ అందిస్తుండగా, తాజాగా మరో రూ. 1000 లు పెంచి మొత్తం రూ. 4,116 లకు పెంచారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రానున్న కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వికలాంగు ల సంఘం నాయకులు బండ జగన్‌ను శాలువాతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘనంగా సత్కరించారు. కార్య క్రమంలో బిఆర్‌ఎస్ సీ నియర్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, శివ ముదిరాజ్, సయ్యద్ అహ మ్మద్ భక్తి యార్, వెంకటేష్, డివిజన్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, మైనార్టీ కమిటీ అధ్యక్షులు మక్బూల్, బల్ల ప్రశాంత్, మహాంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ ఎయిర్‌టెల్ రాజు, వికలాంగుల సంఘం నాయకులు బండ జగన్, శోభ, స్పోర్ట్ మహేష్, అన్న మహేష్, యాదగిరి, సంతో ష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News