Monday, December 23, 2024

జపాన్‌లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

టోక్యో: ఉత్తర జపాన్‌లో 6.2 స్థాయిలో భూకంపం సంభవించింది. ప్రధానమైన దీవి హొకైడోలో సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు భయకంపితులయ్యారు. ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆ ప్రాంతంలోని న్యూక్లియర్ ప్లాంట్లకు కానీ, విద్యుత్ సరఫరాకు, బులెట్ రైళ్ల రాకపోకలకు ఆటంకాలు కానీ ఏర్పడినట్టు సమాచారం ఏదీ లేదు.

హొకైడో నైరుతి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు 140 కిమీ లోతున ఈ భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఆ దీవిలోని చితోస్, అసుమచో పట్ణటాలను భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. టోక్యో నగరం ఉన్న ఉత్తర హోంషు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తాకినా, టోక్యోకు మాత్రం ఎలాంటి ప్రకంపనలు తాకలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News