Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని మాటేడు, ఫత్తేపురం, పోలెపల్లి గ్రామాల్లో బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మెళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనంలో ఉషాదయాకర్‌రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలను సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టడంతో దేశానికే ఆదర్శంగా నిలిచాయాన్నారు. ఉమ్మడి రా ష్ట్రంలో గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి ఎలా జరుగుతుందో నెమరువేసుకోవాలన్నారు.

వందల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గంలోని మంత్రి దయాకర్‌రావు ప్రతీ గ్రామంలో సిసి రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, బీటీ రోడ్ల మరమ్మతులు, సెంట్రల్ లైటింగ్ తదితర ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు. సాగునీటి విషయంలో సమైక్య రాష్ట్రంలో ఎడారిగా మారిన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పంట పొలాలతో పాడి పంటలతో తులతూగుతోందని అన్నారు. ఒకప్పుడు ఎడారి నియోజకవర్గంగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గం నేడు సస్యశ్యామలం కావడానికి మంత్రి దయాకర్‌రావు కృషి, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుత నిర్ణయాలతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాలను తీసుకువచ్చి పంటలకు నీరందించిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు, అవసరమైన ఎరువులు అందించి, రైతు బంధుతో ప్రతీ ఎకరాకు రూ.పదివేలు అందించిన మహనీయుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు కుటుంబాలకు భరోసా కల్పించిన నాయకుడిని ప్రతీ రైతు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని సూచించారు. మహిళల కోసం కోట్లాది రూపాయల వడ్డీలేని రుణాలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే పింఛన్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం కుట్టు శిక్షణపై ఉచితంగా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లను అందజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమానికి ముందు ఉషాదయాకర్‌రావుకు గ్రామస్తులు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, నాయకులు లింగాల వేంకటనారాయణగౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మండల రైతు బంధు కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News