సిటీబ్యూరో: వానాకాలంలో విద్యుత్ సరఫరాలో కలిగే అంతరాయాలను అధిక మించేందుకు విద్యుత్ శాఖ సమాయత్తం అవుతోంది. వర్షాలు పడినప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ అధికారులు మందస్తు చర్యలు ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పటిష్టమైన చర్యలకు సిద్ధ్దమైన అధికారులు విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. పాత విద్యుత్ తీగల లైన్ల పునరుద్ధ్దరణతో పాటు కొత్తవి అందుబాటులోకి తీసుకు రావడం, చెట్లకొమ్మలను తొలగించడం, నేలకొరిగిన విద్యుత్ స్తంభాల తొలగింపు వం టి పనులు చేపట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.
రానున్న వర్షాకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు ఎ క్కువగా రిపేరు అయ్యే అవకాశం ఉండంటంతో ఒక్కో స ర్కిల్లో 50 నుంచి 80 ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతరాయాలు ఏర్పడితే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్ అందించే వి ధంగా చర్యలు తీసుకుంటున్నారు.
చెట్లు విరిగిన ప్రాం తాల్లో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ఏవీ కేబుళ్ళతో విద్యుత్ సరఫరా అందించే ప్రత్యామ్నాయ మార్గలను ముందే సిద్దంచేస్తున్నారు.వర్షాకాలంలో ఏ చిన్న గాలి వచ్చినా వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అలాంటి సమస్యలు తగ్గించేందుకు చెట్లు ఉన్న ప్రాం తాల్లో 800- 100 మీటర్ల ఎల్ ఏవీ(లో టెన్షన్ ఎయిర్ బంచ్) కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ జోన్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కేబుల్స్ వినియోగిస్తున్నా రు. విద్యుత్ శాఖ నగర వ్యాప్తంగా చెట్లు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు.
ఫీడర్లలో ట్రిప్పింగ్, బ్రేక్‌డౌన్స్ సమస్యలు తల్తెకుండా ఉండేందుకు ఎల్‌టిఏవీ కేబుల్స్ ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. వీటి వినియోగంతో విద్యుత్ ప్రమాదాలు జరగవని ఇంజనీర్లు చెబుతున్నారు. చెట్ల మధ్యలో ఎల్‌టిఏవీ కేబుల్స్ ఉన్నా సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం గాలి వానకు చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఒక్కో సర్కిల్లో 6 నుంచి 8 కంట్రోల్ రూంలు ఏర్పా టు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సీబీడీ (సెంట్రల్ బ్రేక్ డౌన్ గ్యాంగులు) లైన్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండే విధంగా షిఫ్ట్ పద్దతులు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ పరికరాల మరమ్మత్తులకు చేతి గ్లౌజ్, ఏర్త్‌రాడ్, ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏడీఈ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన నలుగురు ఏఈలు, కంట్రోల్ రూంకు వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.చెట్లు విరిగిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు 20 నుంచి 25 డిజాస్టర్ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌లో కనస్ట్రక్షన్, లైన్స్, ఆపరేషన్ అధికారులతో పాటు డైరక్టర్ స్థాయి అధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. డిజాస్టర్ టీమ్‌లను ఎఫ్ ఓసీ,సీబీడీలకు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్నారు. డిజాస్టర్ టీమ్‌లో ఐదుగురు అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.