- Advertisement -
నారాయణఖేడ్ టౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నారాయణఖేడ్ పట్టణంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఖేడ్‌లోని తహాశీల్దార్ గ్రౌండ్ నుంచి ప్రధాన రహదారి గుండా నిర్వహించారు. ఈ 2కే రన్ కార్యక్రమాన్ని ఖేడ్ డిఎస్పి వెంకట్‌రెడ్డి జెండా ఊపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణారెడ్డి, ఆయా మండలాల ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రశాంత్, నారాయణ, దశరథ్, మున్సిపల్ చైర్మన్ రుబినా నజీబ్, జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్‌బుజ్జి, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు నగేష్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -