వైరా : ఆరోగ్య తెలంగాణ దిశగా సిఎం కెసిఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైరా ఎంఎల్‌ఎ లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం వైరాలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2కె రన్‌ను పోలీసు శాఖ ఆధ్వర్యంలో వైరా పాత బస్టాండ్ సెంటర్ నుండి క్రాస్‌రోడ్ సెంటర్ వరకు నిర్వహించారు.
ఈ 2కె రన్‌లో పోలీసు సిబ్బంది, యువతీ, యువకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీయం కేసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల అభివృద్ధికి భాటలు వేస్తున్నారన్నారు. ఆరోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం ముదంజలో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వైరా ఏసిపి రెహమాన్, సిఐ సురేష్, ఎస్‌ఐ వీరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, పార్టీ మండలాధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జునరావు, సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, డాక్టర్ కాపా మురళీకృష్ణ, పెనుగొండ ఉపేందరరావు, సుభాని తదితరులు పాల్గొన్నారు.