Monday, December 23, 2024

రాష్ట్ర సాధనలో పోలీసులే కీలకం

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : తెలంగాణ రాష్ట్ర సాధనలో పోలీసులు కీలక పాత్ర పోషించారని స్థానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సబ్‌డివిజన్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ ర్యాలీ గోవింద్‌సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు సాగి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఎల్‌ఎ మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పోలీస్‌లకు ముఖ్యమంత్రి కెసిఆర్ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. యువత తెలంగాణ పోలీస్‌లను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్‌లో ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారి రమణామూర్తి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జెడ్‌పి సిఇఒ విద్యాలత, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్ జానీపాష, సిఐ కరుణాకర్, మున్సిపల్ కమీషనర్ అంకుషావళి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్‌లు, సబ్‌డివిజన్ పోలీస్ అధికారులు, బిఆర్‌ఎస్ నేతలు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News