Saturday, November 23, 2024

ఆరోగ్యం గురించి ప్రతిఒక్కరూ పాటుపడాలి

- Advertisement -
- Advertisement -
  • 5కె, 10కె రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
  • జిల్లా జడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ

సిద్దిపేట: ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా జడ్పి చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సిపి శ్వేత అన్నారు. తెలంగాణ దశాబ్బి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ 5కె, 10కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు తప్పకుండా వాకింగ్ రన్నింగ్ , యోగా మన జీవితంలో ఒక భాగం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ నిర్వహించడం అభినందనీయన్నారు.

ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ గురించి పాటు పడాలని సూచించారు. మనిషికి శారీరక శ్రమ చాలా ముఖ్యమని తెలిపారు. మంచి ఆరోగ్యం గురించి ప్రతిఒక్కరూ పాటు పడాలన్నారు. అనంతరం సిపి శ్వేత మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏ కార్యక్రమం నిర్వహించిన వెన్నుదన్నుగా నిలుస్తున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి మనిషి ఆరోగ్యం గురించి కదులుతూ ఉండడం ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ రన్నింగ్, వాకింగ్ జీవితంలో బాగస్వామ్యం కావాలన్నారు. సిద్దిపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని ఆరోగ్య సిద్దిపేటగా మార్చడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.

సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి మహేందర్, ఏఆర్ అదనపు డిసిపిలు రామచంద్రరావు, సుబాష్ చంద్రబోస్, ఎసిపిలు దేవారెడ్డి,రమేశ్, ఫణిందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, యువతి యువకులు, మెడికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News