Monday, January 20, 2025

పేద విద్యార్థికి మంత్రి జగదీష్‌రెడ్డి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

భానుపురి: విదేశాల్లో ఉద్యోగం వచ్చిన అక్కడి వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వెయ్యి ఫౌండ్ల ఆర్థికసాయాన్ని అందజేశారు. వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షెక్ నజీర్ తండ్రి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

తల్లి ఇండ్లల్లో పని చేస్తూ కుమారుడు నజీర్, కుమార్తెను చదివించింది. నజీర్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఇటీవల లండన్‌లో ఐసీయూ స్పెషలిస్ట్ గ్రేడ్5 మేల్ నర్సుగా ఉద్యోగం సాధించాడు. దీంతో ఆనందపడిన ఆ కుటుంబానికి లండన్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో లండన్ వెళ్లేందుకు ఆర్థికసాయం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని సంప్రదించగా వెంటనే ఉద్యోగ వివరాలు తెలుసుకోని వెయ్యి ఫౌండ్లు( లక్ష రెండువేల)ను అందజేశారు. దీంతో నజీర్ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్‌రెడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News