Monday, December 23, 2024

ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోని కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని (86) మిలన్ లోని శాన్ రఫేల్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణల నుంచి బయటపడిన ఆయనకు కొన్నేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధి సోకగా, ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కూడా సోకడంతో చికిత్స పొందుతున్నారు. 1994లో ఆయన మొదట ఇటలీ ప్రధాని అయ్యారు. 2011 వరకు నాలుగుసార్లు ప్రధానిగా ప్రభుత్వాన్ని నడిపించారు. కోటీశ్వరుడు, వ్యాపార వేత్త అయిన బెర్లుస్కోని రాజకీయాల్లోకి రాకముందు ఇటలీ లోనే అతిపెద్దదైన మీడియా సంస్థను నెలకొల్పారు. ఫోర్జా ఇటాలియా అనే పార్టీని స్థాపించి దేశ ప్రధాని అయ్యారు. సెప్టెంబర్ ఎన్నికల తరువాత ఇటలీ ఎగువ సభ సెనేట్‌కు తనకు తానే ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సర్కారులో భాగస్వామిగా తమ పార్టీ చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News