- Advertisement -
మునగాల: మండలంలోని రేపాల గ్రామానికి చెందిన సోమపంగు నాగరాజుకు చెందిన గాలి మిషన్ షాపు సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్కాసర్క్యూట్ కారణంగా దగ్థమైంది. ఉదయం వీచిన గాలితో షార్ట్ సర్క్యూట్ కావడంతో షాపు దగ్గర ఎవరూ లేని సమయంలో మంటలు అంటుకోవడంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది. దీంతో స్థానికులు మంటలను ఆర్పేయడంతో పక్కనే ఉన్న వరి గడ్డి వాములకు మంటలు అనుకోకుండా కాపాడగలిగారు.
కానీ మంట్లో షాపులోని గాలి మిషన్ వెల్డింగ్ మిషన్ ఇతర సామాగ్రి కాలిపోయి సుమారు 50 వేల నష్టం వాటిల్లిందని షాపు యజమాని నాగరాజు తెలిపారు. ఉండడానికి ఇళ్లు కూడా లేని నాగరాజుకు జీవనాధారంగా ఉన్న గాలి మిషన్ షాపు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయిన నాగరాజును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- Advertisement -