Saturday, November 23, 2024

దేశంలో నెంబర్ వన్‌గా రూపుదిద్దుకున్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ పోలీస్ వ్యవస్థ రూ పుదిద్ధుకున్నదని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాంగా తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీస్, క్రీడా శాఖ నేతృత్వంలో గోదావరిఖనిలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథి గా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ టి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ తెలంగాణ రన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీదుగా ప్రధాన చౌరస్తా వరకు జరిగింది.

ఈ 2కె రన్ గమ్యాన్ని మొదటిగా చేరుకున్న పది మందికి నగదు బహుమతులు, ఇతరులకు ప్రోత్సాహకాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత సిఎం కెసిఆర్ పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.

శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సులభతరమవుతుందని, పెట్టుబడులు వస్తాయని ఉద్దేశ్యంతో పోలీసు శాఖలో సమూల మార్పుల తీసుకు వ చ్చారని అన్నారు. పోలీసు నూతన భవనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పోలీసు వాహనాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలం గాణ పోలీసులకు అందుబాటులోకి తీసుకు వచ్చారని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు.

నేర రహిత సమాజమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌ న్ సిఐలు ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, టూటౌన్ సిఐలు సూరం వేణుగోపాల్, సుందర్ రావు, మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, కా ర్పొరేటర్ బాలరాజ్‌కుమార్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బాలసాని స్వామి గౌడ్, జెవి రాజు, నారాయణదాసు మారుతి, కాల్వ శ్రీనివాస్, రాకం వేణు, బెందే నాగభూషణం, వడ్డెపల్లి శంకర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News